ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైరస్​పై పోరాట యోధులకు బీమా నగదు అందజేత - corona effect on visakha

కొవిడ్ బాధితుల‌కు వైద్య సేవ‌లందిస్తూ.. వైరస్ బారిని ప‌డిన కేజీహెచ్ ప్రొఫెస‌ర్ పురుషోత్తం క‌న్నుమూశారు. డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి బీమా ప‌రిహారం రూ.50 లక్షల చెక్కును న్యూఇండియా అధికారులు అంద‌జేశారు.

Insurance money distributed to covid warriors in visakha
వైరస్​పై పోరాట యోధులకు బీమా నగదు అందజేత

By

Published : Oct 9, 2020, 7:56 PM IST

Updated : Oct 9, 2020, 8:02 PM IST

కొవిడ్ బాధితుల‌కు సేవ‌లందిస్తూ.. దాని నిరోధం, వ్యాప్తికి అడ్టుక‌ట్టవేసే పోరాటంలో ప్రాణాలు కొల్పోయిన హెల్త్ వ‌ర్కర్ల‌కు న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ ప‌రిహారం అందించింది. కొవిడ్ బాధితుల‌కు వైద్య సేవ‌లందిస్తూ.. వైరస్ బారిని ప‌డిన కేజీహెచ్ ప్రొఫెస‌ర్ పురుషోత్తం క‌న్నుమూశారు. డాక్టర్ పురుషోత్తం కుటుంబానికి బీమా ప‌రిహారం రూ.50 లక్షలు న్యూఇండియా అధికారులు అంద‌జేశారు. డాక్టర్ పురుషోత్తం స‌తీమ‌ణి.. డాక్టర్ రాజ్యల‌క్ష్మికి ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అంద‌జేశారు.

ప్రధానమంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా కొవిడ్​పై పోరుచేస్తున్న శానిటేష‌న్ వ‌ర్కర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది, న‌ర్సింగ్ స్టాఫ్, వైద్యులకు బీమా సదుపాయాన్ని కేంద్రం క‌ల్పించింది. మొద‌ట మూడు నెల‌ల‌కు మాత్రమే ఈ ప్యాకేజీని ప్రక‌టించినా.. త‌ర్వాత మ‌రో ఆర్నెల్ల పాటు దీనిన‌ి పొడిగించింది. ఇంత‌వ‌ర‌కు మొత్తం ఈ కేట‌గిరిలో ప్రాణాలు కొల్పోయిన 7 కుటుంబాల‌కు మూడున్నర కోట్ల‌ను చెల్లించామ‌ని విశాఖ‌ ‌న్యూఇండియా అస్యూరెన్స్ డీజీఎం సీజీ ప్రసాద్ వెల్లడించారు.

ఇదీ చదవండీ... సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా

Last Updated : Oct 9, 2020, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details