విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు నౌకాదళం సముద్ర సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మాల్దీవుల నుంచి 698 మందితో బయలుదేరిన ఐఎన్ఎస్ జలాశ్వ కేరళలోని కొచ్చికి చేరుకుంది.
వీరిలో 440 మంది కేరళకు చెందిన వారు కాగా ... మిగిలిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల వారు. మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను రెండు నౌకాదళ ఓడల్లో దేశానికి తరలిస్తున్నారు. కొచ్చికి చేరుకున్న వారికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వైద్య పరీక్షలు చేస్తారు.