ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వెంటిలేటర్ల కొరత రాకుండా ప్రత్యేక చర్యలు' - industries permissions due to lockdown situation

రాష్ట్రంలో అత్యవసర ఉత్పత్తులు అందించే పరిశ్రమలకు పరిమిత సంఖ్యలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో ఫార్మా పరిశ్రమలు తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు ఇండస్ట్రీస్​ మేనేజర్​ రామలింగేశ్వరరాజు వెల్లడించారు. కీలకమైన వెంటిలేటర్ల కొరత రాకుండా.. మెడ్​టెక్​ పార్కులో తయారీకి అనుమతులిచ్చినట్లు వివరించారు.

'వెంటిలేటర్ల కొరత రాకుండా తయారీకి ప్రత్యేక అనుమతులు'
'వెంటిలేటర్ల కొరత రాకుండా తయారీకి ప్రత్యేక అనుమతులు'

By

Published : Apr 3, 2020, 8:10 PM IST

వైద్య ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రత్యేక అనుమతులిస్తున్నామన్న ఇండస్ట్రీస్​ మేనేజర్​

రాష్ట్రంలో లాక్​డౌన్​ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అయితే కొన్ని అత్యవసరమైన పరిశ్రమలకు మాత్రం ప్రత్యేక అనుమతుల ద్వారా ఉత్పత్తి చేసేందుకు అధికారులు అనుమతులిచ్చారు. పారిశ్రామిక నగరంగా పేరొందిన విశాఖలో ఫార్మా పరిశ్రమలు తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఆయా సిబ్బందికి పరిమిత సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు ఇండస్ట్రీస్​ జనరల్​ మేనేజర్​ రామలింగేశ్వరరాజు తెలిపారు. ముఖ్యంగా కరోనా బాధితులకు చికిత్స అందించడంలో వెంటిలేటర్ల కొరత రాకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విశాఖలో వైద్య పరికరాల తయారీ కేంద్రం మెడ్​టెక్​ పార్కులో వెంటిలేటర్లు తయారు కానున్నట్లు చెప్పారు. వైద్య సేవలకు అవసరమయ్యే ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమన్న రామలింగేశ్వరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details