ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బొగ్గు రవాణాలో తూర్పు కోస్తా జోరు..! - indian railway working news

తూర్పు కోస్తా రైల్వే.. లాక్ డౌన్ సమయంలో ఇప్పటివరకు 2,683 బొగ్గును రవాణా చేసింది. మొత్తం 10.5 మిలియన్ టన్నుల బొగ్గును గనుల నుంచి పరిశ్రమలకు అందించింది. దేశవ్యాప్త లాక్ డౌన్​లో భాగంగా భారతీయ రైల్వే ప్రయాణికుల రవాణాను పూర్తిగా నిలిపివేసినా.. సరకు రవాణాలో గరిష్ట సామర్థ్యాన్ని చూపింది.

indian railway working in lock down
indian railway working in lock down

By

Published : Apr 29, 2020, 9:38 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​లో భాగంగా భారతీయ రైల్వే ప్రయాణికుల రవాణా పూర్తిగా నిలిపివేసినా.. ఇతర రవాణాకు ఉపయోగిస్తోంది. ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును పరిశ్రమలకు అందిస్తోంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని తాల్చేరు నుంచి చాలా రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తోంది.

లాకౌడౌన్ మొదలైన మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు పదిన్నర టన్నుల బొగ్గును తాల్చేర్ నుంచి వివిధ పవర్ ప్లాంట్ లకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు రవాణా చేశారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో అతి పెద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం తాల్చేర్. మహానది పరివాహక ప్రాంతంలో ఒడిశాలో ఉన్న ఈ బొగ్గు గని నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు నల్ల బంగారాన్ని రవాణా చేశారు.

మొత్తం 11 బొగ్గు సైడింగ్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 6.48 మిలియన్ టన్నుల ధర్మల్ కోల్​ను 1,695 రైళ్ల ద్వారా పంపారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కోసం కోక్, కోల్ ఇతర మినరల్స్​ను ఒకటిన్నర మిలియన్ టన్నులు, దిగుమతి కోల్ 322 రైలు ద్వారా రవాణా చేసింది. దమార పోర్టు థర్మల్ కోల్ 1.2 మిలియన్ టన్నులు 295 రైళ్ల ద్వారా వివిధ పరిశ్రమలకు పంపింది.

విశాఖపట్నం పోర్టు 0.95 మిలియన్ టన్నుల బొగ్గును 232 రైళ్ల ద్వారా రవాణా చేసింది. గంగవరం పోర్టు 0.39 మిలియన్ టన్నుల బొగ్గును 96 రైళ్లలో పంపించింది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలు, క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాలు, ఒడిశా, పశ్చిమ్​బంగ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సేవలు అందించింది.

ఇవీ చదవండి:

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు

ABOUT THE AUTHOR

...view details