భారత్-శ్రీలంక నౌకా దళాల మధ్య పరస్పర సహకారం కోసం ఏటా జరుగుతున్న స్లినెక్స్-20 విన్యాసాలు.. శ్రీలంకలోని ట్రింకోమలైస మీపంలో హిందూ మహా సముద్రంలో ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. అనుకూల పరిస్థితులు, పొరుగు దేశాల మధ్య ప్రాంతీయ సహకారం కోసం ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ విన్యాసాలు భారత్లో జరిగాయి. కొవిడ్ కారణంగా భౌటికదూరం పాటించాలనే నిబంధన నేపథ్యంలో... రెండు నౌకాదళాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత నౌకాదళం నుంచి కమోర్ట, కిల్టన్, శ్రీలంక నేవీ నుంచి గజబాహు, సౌర్య నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి.
హిందూ మహా సముద్రంలో ఇవాళ్టి నుంచి స్లినెక్స్-20 విన్యాసాలు
స్లినెక్స్-20 విన్యాసాలు శ్రీలంకలోని ట్రింకోమలైస మీపంలో హిందూ మహా సముద్రంలో ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. భారత నౌకాదళం నుంచి కమోర్ట, కిల్టన్, శ్రీలంక నేవీ నుంచి గజబాహు, సౌర్య నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
హిందూ మహా సముద్రంలో ఇవాళ్టి నుంచి స్లినెక్స్-20 విన్యాసాలు
Last Updated : Oct 19, 2020, 5:39 AM IST