ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో భారత్​-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్​ - Cricket Match

T-20 Match. టీమిండియాకు ఎంతో అచ్చొచ్చిన విశాఖ వేదికగా మూడో ట్వంటీ-20 మ్యాచ్‌ నేడు జరగనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన భారత్‌కు..విశాఖ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. విశాఖ మైదానమంటేనే పరుగుల వరదగా పేరున్న ఇక్కడ.. భారత్‌కు మంచి రికార్డు ఉంది. దీంతో భారత క్రికెటర్లలో, అభిమానుల్లో ఇక్కడ మ్యాచ్‌ అంటే గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయపడుతుంటారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 200పైగా పరుగులు సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

1
1

By

Published : Jun 14, 2022, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details