విశాఖలో నకిలీ మద్యం రవాణా చేస్తున్న కేసులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, నగర పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. గాజువాక మండలం వడ్లపూడి వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు భారీగా మద్యం, ఖాళీ సీసాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. కెమికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆ మద్యం తాగడానికి ప్రమాదకరమని తేల్చారు. ఈ కేసులో నిందితులను విచారించిన పోలీసులు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా ఒడిశాలోని బ్రహ్మపూర్లో అతడిని అరెస్టు చేశారు. అక్రమ, నకిలీ మద్యం నిల్వలు కలిగి ఉన్నా లేదా సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ ఏడీసీపీ అజిత వేజండ్ల తెలిపారు.
కర్ణాటక మద్యం పట్టివేత