విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి.. తమిళనాడులోని దిండిగల్ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 120కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు.. కాజా టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీలో గంజాయిని గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు.. మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అనకాపల్లి నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు.. ఇద్దరు అరెస్ట్ - తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు.. కాజా టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. 120కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు.. మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు.
అనకాపల్లి నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
TAGGED:
gangai seazed at mangalgiri