ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమ మద్యం పట్టివేత... నిందితులు అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా.. ఎస్​ఈబీ అధికారులు దాడులు కొనసాగించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం సరఫరా చేస్తున్న వారిని అరెస్టు చేశారు.

By

Published : Apr 18, 2021, 8:42 AM IST

Illegal alcohol seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం

విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని కె.జె.పురంలో అక్రమంగా నిల్వచేసిన నలభై మద్యం సీసాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామ వాలంటీర్ భాస్కరరావు, ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సేల్స్ మెన్ నూక అప్పారావును అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇదే గ్రామంలో వ్యక్తి నుంచి మూడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై రామారావు తెలిపారు.

అనంతపురం జిల్లాలో...

గొల్లపల్లి క్రాస్​ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న అరవై మద్యం ప్యాకెట్లను సీజ్​ చేసినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. మడకశిర ఎస్​ఈబీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో మద్యం తరలిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. గోవిందపురం గ్రామంలో తిమ్మరాజు అనే వ్యక్తి బైక్​లో 47 కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్నూలు జిల్లాలో...

జిల్లా సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్​ఈబీ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 195 మద్యం సీసాలను‌ స్వాధీన పరచుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసి.. నాలుగు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్​ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రాధాన్య ప్రాజెక్టులు: ఏళ్ల తరబడి సాగుతున్న పనులు

ABOUT THE AUTHOR

...view details