నర్సీపట్నంలో దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న 10 మంది గుర్తింపు
కరోనా వైరస్ అనుమానంతో విశాఖ జిల్లా నర్సీపట్నంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన 10 మంది ముస్లింలను అధికారులు విశాఖకు తరలించారు. వీరంతా దిల్లీలో ఇటీవల జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరై గత నెల 15వ తేదీన విశాఖకు తిరిగి వచ్చారు. అక్కడి నుంచి మత ప్రచారం కోసం నర్సీపట్నం చేరుకున్నారు.