ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక - కరోనా వ్యాక్సిన్ పరీక్షలు వార్తలు

icmr-gave-permissions-to-corona-vaccine-clinical-tests-in-vishaka-kgh
icmr-gave-permissions-to-corona-vaccine-clinical-tests-in-vishaka-kgh

By

Published : Jul 3, 2020, 2:53 PM IST

Updated : Jul 3, 2020, 5:18 PM IST

14:49 July 03

కేజీహెచ్​లో వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక

కరోనా వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు కేంద్రాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఎంపిక చేసింది. 

ఏపీలో విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిని ఐసీఎంఆర్‌ ఎంపిక  చేసింది. వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు నోడల్‌ అధికారిగా కేజీహెచ్‌ వైద్యుడు డాక్టర్‌ వాసుదేవ్‌ను నియమిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ఆయన విమ్స్‌లో కరోనా రోగులకు వైద్యం అందించే విధుల్లో కొనసాగుతున్నారు. అలాగే,  తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చింది. ఇక్కడ పరీక్షలకు నోడల్‌ అధికారిగా డాక్టర్‌ప్రభాకర్‌ రెడ్డిని నియమించింది. 

Last Updated : Jul 3, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details