ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపేసి.. ఆపై.. - మద్యం మత్తులో భార్య హత్య మత్తు దిగిన తర్వాత భర్త ఆత్మహత్య

Husband killed Wife In Paderu Agency: మద్యం ఇల్లు గుల్ల చేసేది ఒకప్పుడు.. రానురానూ..ఏకంగా ఇంట్లో వారి ప్రాణాలను సైతం తీసేందుకు కారణమవుతోంది. పీకలదాకా మద్యం సేవించిన ఓ భర్త విచక్షణ కోల్పోయాడు. కట్టుకున్న భార్యనే బలి తీసుకున్నాడు. తెలివి వచ్చాక జరిగిన దానికి బాధపడి అదే గొడ్డలితో తన ప్రాణాలు తీసుకున్నాడు. వారి ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది.

Husband killed Wife In Paderu
మద్యం మత్తులో భార్యను గొడ్డలితో కొట్టి..ఆపై తానూ...

By

Published : Jan 4, 2022, 10:30 PM IST

Husband killed Wife In Paderu Agency: మద్యం మత్తులో భార్యను హత్యచేసి.. తెలివివచ్చాక తాను చేసిన తప్పు తెలుసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది...

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయితీ మారుమూల రామారావుపేటలో గణపతి, తులసి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి వచ్చి భార్య తులసితో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే ఫూటుగా మద్యం తాగిన గణపతి..ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడసాగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో విచక్షణ కోల్పోయిన అతను అక్కడే ఉన్న గొడ్డలితో భార్య తులసి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది.

మద్యం మత్తులో ఉన్న గణపతి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. మత్తు దిగాక ఉదయం లేచిన గణపతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి ఖంగుతున్నాడు. రాత్రి జరిగిన ఘర్షణను గుర్తు చేసుకున్నాడు. పీకల్లోతు తాగి తాను చేసిన తప్పేంటో తప్పు గ్రహించాడు. అదే గొడ్డలితో తన మెడపై నరుక్కున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అపస్మారక స్థితిలో ఉన్న గణపతిని చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ గణపతి తుది శ్వాస విడిచాడు. గణపతి మద్యం మత్తులో చేసిన పని వారి ఇద్దరు పిల్లలకు అనాథలుగా మార్చిందని బంధువులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి :

Food Poison: మధ్యాహ్న భోజనం వికటించి.. 40మంది విద్యార్థులకు అస్వస్థత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details