ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోస్కోను రానివ్వం'.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల దీక్షలో నేతలు

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో కార్మిక సంఘాల దీక్షలో పాల్గొన్న ఆయన.. పోస్కో సంస్థ విశాఖ రావడానికి వీల్లేదన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రయివేటీకరణపై ఎక్కడివరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అందరూ కలిసి రావాలని కోరారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ
vizag steel plant privatization

By

Published : Feb 12, 2021, 10:12 AM IST

Updated : Feb 12, 2021, 10:33 AM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాఖలోని కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో.. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు.

వేలాది ఎకరాల భూములను దోచుకునేందుకే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఏ పరిశ్రమకైనా భూములు కేటాయిస్తే వారు అమ్ముకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు.. చిత్తశుద్ధితో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడితే రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడినట్టేనని వ్యాఖ్యానించారు. పోస్కో.. విశాఖ రావడానికి వీల్లేదన్నారు.

మంత్రి అవంతి శ్రీనివాస్

'ఎన్నో పోరాటల ఫలితం ఉక్కు పరిశ్రమ. పరిశ్రమ స్థాపన నుంచి ఆరు వేల కోట్ల నికర లాభంలో ఉంది. కరోనా నేపథ్యంలో నష్టాలు రావొచ్చు. అంతమాత్రనా.. ప్రయివేటీకరణ చేయటం ఏ మాత్రం సరికాదు. ఏట్టిపరిస్థితుల్లో పోస్కోను రానివ్వం. నగరం నడ్డిబొడ్డున లక్ష కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల ఆస్తి..దీన్ని ప్రయివేటీకరణ చేసే హక్కు ఏ ప్రధాని, ముఖ్యమంత్రికి లేదు. ఈ విషయంపై వైకాపా తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదు. పవన్ కల్యాణ్‌ కూడా ఉద్యమానికి సహకరించాలి '- మంత్రి అవంతి శ్రీనివాసరావు

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఎస్‌ఈసీ

Last Updated : Feb 12, 2021, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details