ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HUGE THEFT IN VISAKHAPATNAM : విశాఖలో భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు మాయం - visakhapatnam district crime

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దొంగలు.. భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని జనతా కాలనీలో(Theft in vishakhapatnam janata colony) జరిగింది. ఈ ఘటనలో 70 తులాల బంగారం, రూ.15 లక్షల నగదు, 8 కిలోల వెండి దోచుకెళ్లారు.

గోపాలపట్నంలో దొంగతనం
గోపాలపట్నంలో దొంగతనం

By

Published : Nov 28, 2021, 10:19 PM IST

Updated : Nov 29, 2021, 6:37 PM IST

విశాఖ జనతా కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ ఘటనలో 70 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.15 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జనతా కాలనీకి చెందిన పసుమర్తి వైకుంఠరావు గోపాలపట్నంలో పూజసామగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయాన్నే కుమార్తెను పాఠశాలలో వదిలిపెట్టి భార్యతో కలిసి దుకాణానికి వెళ్లారు. సాయంత్రం గ్యాస్ డెలివరీ కోసం వచ్చిన వ్యక్తి.. ఇంటి తలుపు తెరిచి ఉండటంతో అనుమానించి వైకుంఠరావుకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఇంటికి వచ్చిన వైకుంఠరావు దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారమే బ్యాంకు నుంచి నగలు, నగదు తీసుకొచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్రైమ్ డీసీపీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి పరిసరాల్లో కారులో తిరిగారనే వివరాల ఆధారంగా.. దొంగల కోసం గాలింపు(Inquiry about Theft incident) చేపట్టారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 29, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details