ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్యాస్ లీకేజేతో 300 మందికి అస్వస్థత: కలెక్టర్‌ - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన విషవాయువును సుమారు 300 మంది పీల్చుకున్నట్టు కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. లాక్​డౌన్ తర్వాత పరిశ్రమ ప్రారంభించే సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. బాధితులను కేజీహెచ్​కు తరలిస్తున్నట్టు చెప్పారు.

200 మంది అస్వస్థతకు గురయ్యారు: విశాఖ కలెక్టర్‌
200 మంది అస్వస్థతకు గురయ్యారు: విశాఖ కలెక్టర్‌200 మంది అస్వస్థతకు గురయ్యారు: విశాఖ కలెక్టర్‌

By

Published : May 7, 2020, 7:53 AM IST

Updated : May 7, 2020, 10:27 AM IST

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు‌, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లోకి దిగారని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. "ఎల్‌.జీ పాలిమర్స్‌ దక్షిణ ‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3 గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్‌ వాయువు లీకైంది. 4.30గంటలకు మాకు సమాచారం అందింది. లీకైన గ్యాస్‌ వల్ల ప్రాణ నష్టం ఉండదు" అని తెలిపారు.

"స్పృహ తప్పి పడిపోవడం వంటి ప్రభావాన్ని ఈ గ్యాస్‌ కలగజేస్తుంది. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆక్సిజన్‌ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 300 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారు. మరో 2 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం" అని కలెక్టర్‌ వివరించారు.

Last Updated : May 7, 2020, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details