కరోనా కేసులు పెరుగుతున్నందున రాజ్‌భవన్‌లో ఈ ఏడాది హోలీ వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని కోరారు. ఈ ప్రక్రియ వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు సహాయపడుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్ - news updates in rajbhavan
ఈ ఏడాది రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించరాదని గవర్నర్ కోరారు. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండి, కరోనా జాగ్రత్తల నడుమ పండుగ జరుపుకోవాలని సూచించారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్