హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఏపీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు విజయవాడలో సమావేశం నిర్వహించారు. విశాఖలో కొందరు హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఏపీ పేరిట నకిలీ సంస్థ నెలకొల్పారని తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు హెచ్చరించారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఏపీ డీజీపీ, విజయవాడ కమిషనర్లకు సమాచారం అందించామన్నారు. నకిలీ సంస్థ చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని.. త్వరలోనే వారి ఆగడాలను అరికడతామన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఏపీ విభాగం ప్రధాన కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉందని పేర్కొన్నారు. 2018లో కార్యాలయం ప్రారంభమైందని వివరించారు. సంస్థ స్వచ్ఛందంగా సేవ చేస్తోందని.. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.
'విశాఖలో ఉన్నది నకిలీ హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్' - విజయవాడ వార్తలు
విశాఖలో కొందరు నకిలీ హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఏపీ విభాగం నడుపుతున్నారు. ఈ విషయం స్వయంగా హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఏపీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు తెలిపారు. అనధికారికంగా సంస్థ పేరిట నెలకొల్పిన కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు