ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని కోరాపుట్ జిల్లా పాడువాలో హిందూ ధర్మ ప్రచారయాత్ర కొనసాగింది. హిందూత్వం మతం కాదని, భారతీయుల జీవన విధానమని.. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. హైందవ ధర్మాన్ని అనుసరించడం ద్వారా మానవ జీవితం సార్థకమవుతుందని స్పష్టం చేశారు. అన్యమతస్థుల ప్రలోభాలకు లొంగి.. తల్లిలాంటి హిందూ మతాన్ని వదిలిపెట్టవద్దని ఆదివాసీలకు సూచించారు.
విశాఖ శ్రీ శారదాపీఠం తరపున ఆదివాసీ మహిళలకు స్వాత్మానందేంద్ర స్వామీజీ చీరలు పంపిణీ చేశారు. తరిగొండ వెంగమాంబ భజన బృందాలు ఆయనకు స్వాగతం పలికాయి. తమ సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ ఆదివాసీలు వారిని గ్రామంలోకి తీసుకువెళ్లారు. సీతారామ మందిరాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ మతం పట్ల గ్రామస్థులు చాటుతున్న అంకితభావాన్ని అభినందించారు.
కాఫీ మ్యూజియం సందర్శన..