ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత నౌకా వాయు విభాగానికి 'ప్రెసిడెంట్ కలర్స్' పురస్కారం - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్

రక్షణ రంగంలోని అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కలర్స్​కు భారత నౌకా వాయు విభాగం(ఇండియన్ నావల్ ఏవియేషన్) ఎంపికైంది. ఈనెల 6న ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అందించనున్నారు. గోవాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఐఎన్​ఎస్​ హంసలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా తపాల శాఖ ప్రత్యేక కవర్​ను కూడా విడుదల చేయనుంది.

భారత నౌకా వాయు విభాగం
భారత నౌకా వాయు విభాగం

By

Published : Sep 3, 2021, 7:18 AM IST

భారత నౌకా వాయు విభాగానికి 'ప్రెసిడెంట్ కలర్స్' పురస్కారం

రక్షణ రంగం యూనిట్​కు దేశంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కలర్స్​. ఈ పురస్కారం అందుకోవడంలో త్రివిధ దళాల్లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం, పశ్చిమ నౌకాదళం, తూర్పు ఫ్లీట్, పశ్చిమ ఫ్లీట్, సబ్ మెరైన్ ఆర్మ్, ఐఎన్ఎస్ శివాజీ, భారత నౌకా అకాడమీలు వరుసగా ఈ ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారాన్ని అందుకున్నాయి. తాజాగా భారత నౌకా వాయు విభాగం(ఇండియన్ నావల్ ఏవియేషన్)కు ఈ అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి అందించనున్నారు. ఈనెల 6న గోవాలో జరగనున్న ఈ ఉత్సవానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ హాజరు కానున్నారు. ఐఎన్​ఎస్​ హంసలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా తపాల శాఖ ప్రత్యేక కవర్​ను కూడా విడుదల చేయనుంది. గోవా గవర్నర్​, దేశ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి నౌకాదళ చీఫ్ ఇతర మిలటరీ ఉన్నతాధికార్లు దీనికి హాజరుకానున్నారు.

1951లో మొదలైన భారత నౌకా విమానయాన ప్రస్థానం

భారత నౌకా విమానయాన విభాగం 1951లో తొలి ఎయిర్ క్రాఫ్ట్ చేరికతో ఆరంభమైంది. తొలి నేవల్ ఎయిర్ స్టేషన్ గా 1953లో ఐఎన్ఎస్ గరుడ ఏర్పాటైంది. నౌకాదళంలో రక్షణ వ్యవస్ధను మరింత పటిష్టం చేసేందుకు ఆర్మ్​డ్ ఫైర్ ఫ్లై ఎయిర్ క్రాప్ట్ 1958లో చేరిన దగ్గరి నుంచి క్రమంగా ఈ విభాగం విస్తరించడం ఆరంభించింది. సీల్, ఫైర్ ఫ్లై విమానాలను పది చొప్పున, హెచ్​టీటూ ఎయిర్ క్రాఫ్టులు మూడింటితో 1959లో ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 550 ఏర్పాటైంది. అక్కడి నుంచి యేటా కొత్త విమానాలు ఈ విభాగంలో చేరుతూ వచ్చాయి. అలౌటీ, ఎస్​​-55, సీకింగ్ 42ఎ, 42బి, కమోవ్ 25, 28,31 రకానికి చెందిన విమానాలు, యూహెచ్​ 3 హెచ్​, అడ్వాన్స్డ్ లైట్​ హెలీకాప్టర్​, ఎంహెచ్ 60 ఆర్​, ఇందులో కొన్ని.

మారిటైం పునర్వ్యీకరణ కూడా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఎంఆర్ ఎయిర్ క్రాఫ్టుగా ఈ విభాగంలో 1976 భారత వాయుసేన నుంచి ఐఎన్ 38, టియు 142 ఎం వంటివి సమకూరుతూ వచ్చాయి. డోర్నియర్ 228, బోయింగ్ ప 8ఐ విమానాలు అత్యాధునిక వాటిల్లో ఒకటిగా ఈ విభాగంలో చేరాయి.

ఐఎన్​ఎస్​ విక్రాంత్​తో భారత్​ సత్తా ఏంటో తెలిసింది
ఎయిర్ క్రాఫ్టుని మోసుకుపోగల తొలి యుద్ద నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​.. నౌకాదళంలో చేరికతో 1957లో భారత నౌకా వాయు విభాగం సత్తా ప్రపంచానికి తేటతెల్లమైంది.
ఇంటిగ్రల్ సీ హవాక్, అల్జీ స్క్వాడ్రన్స్ తర్వాత కాలంలో మనుగడలోకి వచ్చాయి. 1961లో గోవా విముక్తిలోనూ, 1971 ఇండో -పాక్ యుద్దంలోనూ ఐఎన్​ఎస్​ విక్రాంత్​ పాత్ర అద్వితీయంగా సాగింది. సీహారియర్స్ ద్వారా విరాట్ 1980 నుంచి పలు విన్యాసాలను నిర్వహించింది. మిగ్ 29 కె విమానాల చేరిక ఈ విభాగానికి మరింత ప్రాధాన్యం పెంచింది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య-మిగ్ 29 కె విమానాలద్వారా ఈ విభాగం గతిని పూర్తిగా మార్చేశాయి. దేశీయంగా తయారైన కొత్త ఐఎన్​ఎస్​ విక్రాంత్ విమానాలను మోసుకుపోగల యుద్ద నౌకలలో అత్యాధునికంగా సిద్దమైంది. ఈ కొత్త ఐఎన్​ఎస్​ విక్రాంత్​ ఇప్పటికే సముద్రజలాల్లో తన సన్నద్దతను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది పూర్తి స్దాయిలో ఈనెలలోనే సేవలందించేందుకు సిద్దమైంది.

తొమ్మిది ఎయిర్ స్టేషన్లు

భారత నౌకాదళం.. తొమ్మిది ఎయిర్ స్టేషన్లు ఇప్పటివరకు అభివృద్ది చేసింది. అండమాన్ దీవులతో పాటు మరో మూడు నేవల్ ఎయిర్ ఎన్​ క్లేవ్​లు కూడా రూపుదిద్దుకున్నాయి. ఈ విభాగం ఏడుదశాబ్దాల సుదీర్ఘ పయనంలో ఆధునికతను సంతరించుకుంటూనే, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను అందుకుంటోంది.

ప్రకృతి విపత్తుల్లో విశేష సేవలు

250 విమానాలు ఇప్పుడీ విభాగంలో ఉన్నాయి. ఇందులో యుద్ద విమానాలు, హెలీకాప్టర్లు, రిమోట్ పైలెటెడ్ ఎయిర్ క్రాప్టులు చేరాయి. ఈ విభాగం నేవల్ ఆపరేషన్లకు మూడు దిక్కుల నుంచి పూర్తి సన్నద్దతతో అందుబాటులో ఉంది. సముద్ర జలాల్లో నిఘా, వైపరీత్యాల సమయంలో మానవీయ సాయం అందించడంలో తొలి స్పందన దళంగా ఈ విభాగం సుప్రసిద్దమైంది. ఆపరేషన్ కాక్టస్, జూపిటర్, షీల్డ్, విజయ్, పరాక్రమ్ వంటి వాటిల్లో నౌకాదళ వాయువిభాగం అద్వితీయ పాత్ర పోషించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న దేశాలతో ఆపరేషన్ కాస్టర్ నిర్వహించడంలోనూ, ఆపరేషన్ సుకూన్, ఆపరేషన్ సహాయం, ఆపరేషన్ మాదాద్, ఆపరేషన్ సహాయత, వంటి వాటితో మానవీయ సాయాన్ని అందించడంలో విశేషంగా పనిచేసింది. ఇటీవల ముంబయిలో వచ్చిన తౌక్టే తుపాను సమయంలోనూ ఈ విభాగం ఎంతో సేవలందించి బాధితులను రక్షించింది.

ఇదీ చదవండి:నింగి, నేల, నీరు ఏదైనా.. ఆమె 'ఓడ'దు

ABOUT THE AUTHOR

...view details