ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్యాస్ లీకేజ్: నివేదిక సమర్పణకు హైపవర్ కమిటీ గడువు పెంపు - హైపవర్ కమిటీ గడువు పెంచిన ప్రభుత్వం

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిపుణులతో హైపవర్​ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ కోణాల్లో ఘటనపై విచారణ చేపట్టింది. ఈ నెల 7వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. నివేదిక సమర్పించడానికి మరింత సమయం కావాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. కమిటీ వినతి మేరకు ఈ నెల 22వ తేదీలోగా నివేదిక అందించాలని తాజాగా ఆదేశాలిచ్చింది.

నివేదిక సమర్పణకు హైపవర్ కమిటీ గడువు పెంపుొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొ
నివేదిక సమర్పణకు హైపవర్ కమిటీ గడువు పెంపుొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొొ

By

Published : Jun 9, 2020, 6:44 PM IST

ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి.. గడువు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 22 నాటికి నివేదికను ప్రభుత్వానికి అందించాలని కమిటీని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 7తో కమిటీ గడువు ముగుస్తుంది. నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

కమిటీ విజ్ఞప్తి మేరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రమాద ఘటనపై మరిన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది. వివిధ కేంద్ర సంస్థల నిపుణులకు హైపవర్ కమిటీలో చోటు కల్పించిన ప్రభుత్వం.. సీపెట్, సీపీసీబీ, డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ, ఐఐపీ నిపుణులను కమిటీలో నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details