ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్యాస్​ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ - విశాఖ ఘటనపై కమిటీ విచారణ

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్ సంస్థలో లీకైన ట్యాంక్‌ను ప్రత్యేక రసాయనాలతో అదుపు చేసే పక్రియ ప్రారంభమైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవెన్ తెలిపారు. పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చిందని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన... పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు ప్రత్యేక బృందం కృషి చేస్తోందని వివరించారు.

high power committee on vishaka gas leak incident starts investigation
high power committee on vishaka gas leak incident starts investigation

By

Published : May 8, 2020, 11:12 PM IST

విశాఖలో గ్యాస్​ లీక్​ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిమమించిన ఉన్నతస్థాయి కమిటీవిచారణ ప్రారంభించింది. కమిటీలో సభ్యుడైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవెన్‌... ఈ దుర్ఘటనపై సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గ్యాస్‌ లీక్‌ ఘటనపై విచారణ ప్రారంభించాం. పరిశ్రమ అలారం మోగకపోడంపై విచారణ చేస్తాం. గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామల్లో పర్యటిస్తాం. పరిశ్రమకు సంబంధించిన స్టోరేజ్‌ ట్యాంకులను పరీశీస్తాం. లీకైన ట్యాంక్‌ను ప్రత్యేక రసాయనాలతో అదుపు చేసే పక్రియ ప్రారంభమైంది. పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. గ్యాస్‌ ట్యాంక్‌ ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని కరికల్‌ వలవెన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details