ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎల్​జీ ఘటనపై మూడో రోజు కమిటీ భేటీ... సహాయక చర్యలపై ఆరా - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనపై ప్రభుత్వ హైపవర్​ కమిటీ విచారణ కొనసాగుతోంది. ప్రమాదం తర్వాత అధికారులు చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీసిన కమిటీ.. పత్రికా ప్రతినిధుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుంది. ఎల్​జీ పాలిమర్స్ నిబంధనలు పాటించిందా.. ప్రమాద నివారణ చర్యలు చేపట్టిందా.. అనే అంశాలపై కమిటీ విశ్లేషిస్తోంది.

మూడో రోజు హైపవర్ కమిటీ భేటీ... సహాయక చర్యలపై ఆరా
మూడో రోజు హైపవర్ కమిటీ భేటీ... సహాయక చర్యలపై ఆరా

By

Published : Jun 8, 2020, 5:37 PM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హై పవర్ కమిటీ విచారణ మూడో రోజు కొనసాగింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో జరిగిన కమిటీ భేటీలో.. ప్రమాదం తర్వాత అధికారులు చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. పత్రికా ప్రతినిధుల అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు.

మూడు రోజుల విచారణలో ఎల్​జీ పాలిమర్స్.. అసలు నియమాలు పాటించిందా.. ప్రమాద నివారణకు ఎలాంటి వ్యవస్థ ఉందనే అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. స్టైరీన్​ గ్యాస్ వల్ల భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అనే అంశాలను కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన విధానాలను అన్వేషిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details