విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన పై హైపవర్ కమిటీ శనివారం మెుదటి సారిగా సమావేశమైంది. జాతీయ నిపుణుల కమిటీతో హైపవర్ కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన నివేదికను హైపవర్ కమిటీ అధ్యయనం చేసింది. ప్రమాదానికి అసలు కారణాలేంటన్న విషయం తెలుసుకునే దిశగా దృష్టి పెట్టింది.
ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ట్యాంక్ నిర్మాణ నమూనాతోపాటు... రసాయనాన్ని శీతలీకరణ చేసే విధానంలో అవలంబించిన అంశాలపై చర్చించారు. నీరు, కాలుష్య నియంత్రణ మండలి నివేదికలను పరిశీలించి ప్రమాద ప్రభావ ప్రాంతాలను కమిటీ అధ్యయనం చేసింది. పర్యవరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో హై పవర్ భేటీ నిర్వహించింది.