ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ రేల్వేస్టేషన్​లో 'హయ్​'... ప్రయాణికులకు సేవల్లోనూ 'హయ్​'

ఒక వినూత్న ఆలోచన... సరికొత్త సేవలు చేరువ చేస్తోంది. యువ విధానాన్ని ఎంత వైవిధ్యంగా వినియోగంలోకి తీసుకు వస్తున్నారనే దానికి ఆ ఆవిష్కరణ అద్దం పడుతోంది. రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే కియోస్కీ ఇప్పుడు 'హయ్' అంటూ విశాఖ రైల్వే స్టేషన్​లో పలకరిస్తోంది. ఇంతకీ ఏమిటీ హయ్ ప్రత్యేకత? దీని రూపకర్తలు ఎవరు? ఏ విధంగా హయ్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది? ఈ కథనంలో చూద్దాం....

hi kiasco technology in vishakapatnam railway station
విశాఖ రైల్వే స్టేషన్​లో హయ్​

By

Published : Jan 6, 2020, 9:32 PM IST

విశాఖ రైల్వే స్టేషన్​లో హయ్​

హయ్... ఇప్పుడు భారతీయ రైల్వేల్లో సరికొత్త సేవలు అందించేందుకు సిద్ధమైన కియోస్కీ. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పని ప్రారంభించింది ఈ హయ్. హయ్... హెచ్ఐఐ అంటే హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్. భువనేశ్వర్ చెందిన నెక్సైట్ అనే స్టార్టప్ సంస్థ దీన్ని రూపొందించింది. బీటెక్ పూర్తి చేసిన చిట్టరంజన్ బెహరా ఆలోచన నుంచి పుట్టింది హయ్. ఒకటి రూపొందించి దాని నుంచి విభిన్న సేవలు అందించడం చిట్టరంజన్ లక్ష్యం. ఆ దిశగా స్నేహితుల్ని వ్యాపార భాగస్వాములుగా మార్చుకుని హయ్​ను రూపొందించారు.

హయ్ మెషీన్ ప్రయాణికులకు ఉచిత ఫోన్​గా ఉపయోగపడుతుంది. ఫోన్ చేసే వ్యక్తి ఫొటోను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫేస్ డిటెక్షన్ పూర్తి చేశాక వారు ఏ నెంబర్ కు అయినా ఫోన్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ మెషీన్ పై కనిపించే ట్యాబ్ సహకారంతో అనేక సేవలు పొందవచ్చు. గూగుల్ మ్యాప్స్, ఇంకా రైళ్లకు సంబంధించిన సమాచారం అందించే యాప్ సైతం అందుబాటులో ఉంటుంది. ఇదంతా ఇంటరాక్టివ్ ట్యాబ్లెట్ అందించే సహకారం. ఈ పొడవాటి మెషీన్ రెండు వైపులా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. దీనికి రెండు వైపులా నిలువుగా అమర్చిన డిస్ప్లే స్క్రీన్లతో... వాణిజ్య ప్రకటనలు చేసుకోవచ్చు. ఉన్నాయి. వీటిపై వాణిజ్య ప్రకటనలు చేసుకోవచ్చు. ఆ నగరం... రైల్వే స్టేషన్​కు సంబంధించిన సమాచారాన్ని దానిపై ప్రదర్శించవచ్చు...

హయ్ మెషీన్​ను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు. మూడు వైపులా ఉండే సీసీ కెమెరాలు... నిఘా నేత్రాలుగా వ్యవహరిస్తాయి. ఇలా బహుముఖ రూపాల్లో ఒకే మెషీన్ సేవలు అందిస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్​లో రెండు మెషీన్​లున్నాయి. ఇదే తరహాలో ఏ-1 గ్రేడ్ స్టేషన్లు అన్నింటిలో హయ్​ మెషీన్​లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. నెక్సైట్ సంస్థ నుంచి తీసుకువచ్చిన తొలి ఉత్పత్తిగా ఉన్న హయ్​ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదే తరహాలో మరిన్ని ప్రజా ఉపయోగ ఆలోచనలతో ఫలితాలు సాధిస్తామని సంస్థ నిర్వాహకులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details