హెటిరో విస్తరణకు 2016లో తమ కంపెనీని అనుకుని ఉన్న 108 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విస్తరణకు నాటి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఆ సంస్థకు 108 ఎకరాల్లో 81.03 ఎకరాలను అప్పగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్ కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నప్పుడే గ్రామసభలు జరిపించి పరిశ్రమకు అనుకూలంగా తీర్మానాలు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయిదేళ్ల క్రితం నక్కపల్లి ప్రాంతంలో విశాఖ- చెన్నై పారిశ్రామిక నడవా కోసం భూములు సేకరించినప్పుడు జిరాయితీ భూములకు ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలుకుతోంది. అయినా రూ.18 లక్షల చొప్పునే ఈ 108 ఎకరాలను కేటాయించాలని హెటిరో కోరుతున్నట్లు తెలిసింది.
ప్రభుత్వానికి నివేదిక పంపలేదు