ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు...కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నారు. వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ చంద్ సూచించారు. అత్యవసరసాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటుచేశారు.

విశాఖలో భారీ వర్షాలు... కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విశాఖలో భారీ వర్షాలు... కంట్రోల్ రూమ్ ఏర్పాటు

By

Published : Aug 15, 2020, 10:45 PM IST

విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షాలతో లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. రెవిన్యూ ,పోలీస్,ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు

  • విశాఖపట్నం కలెక్టరేట్ : 08912590102
  • ఆర్టీవో విశాఖపట్నం : 8790310433
  • ఆర్డీవో అనకాపల్లి 8143631525, 8790879433
  • సబ్ కలెక్టర్ నర్సీపట్నం: 8247899530, 7675977897
  • ఆర్డీవో పాడేరు : 08935 250228, 8333817955, 9494670039.

ఇదీ చదవండి :వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details