ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఏవోబిలో గల మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణ, ఛత్తీస్ఘఢ్ వెళ్ళే మార్గంలో రాకపోకలు స్తంభించాయి. కంగురుకొండ సమీపంలో రహదారి మీద నుంచి వరద ప్రవాహం వలన రాకపోకలు నిలిచిపోయాయి. ఒక మినీ లారీ వరద మధ్యలో ప్రయాణిస్తూ నీటిలో కొట్టుకుపోయిన ఘటన వాహన చోదకులుకు భయాందోళనకులకు గురిచేసింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు.
విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంచంగిపుట్టు మండలంలో కురుస్తున్న వర్షాలకు బిరిగూడ, ముంతగుమ్మి, కొజిరిగుడ గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం గేదె గడ్డ , జాము గుడ, ఇంజరి ఆనుకుని ఉన్న గడ్డలు పొంగి ప్రవహించటంతో రాకపోకలు సాగించటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.