విశాఖలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చావుల మదం జంక్షన్ లో భారీగా వరద నీరు చేరుకుంది. రైల్వే స్టేషన్, జ్ఞానాపురం గేటు వైపునకు రాకపోకలకు తీవ్ర అంతరాయం(heavy rain at vizag city lead difficulties to motor vehiclers) కలిగింది. చిన్నపాటి వర్షానికి కూడా నీరు భారీగా నిలిచిపోవడం వల్ల ఈ మార్గం మీదుగా వెళ్లే వారికి తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది.
గతంలో ఈ సమస్య నివారణకు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వకలేకపోతున్నాయని స్థానికులు అంటున్నారు. వర్షం వస్తే ఈ కూడలిలోని నీరు తగ్గాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయే పరిస్ధితి నెలకొందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.