విశాఖలో నాయీ బ్రాహ్మణులు నిరాశ్రయులకు తమ వంతు సేవలందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా రోడ్ల వెంట ఉండే నిరాశ్రయులకు జీవీఎంసీ 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 3 పూటల భోజనం సదుపాయంతో పాటు వైద్య సేవలను అందిస్తోంది. శిబిరాల్లో ఉండే వారికి కటింగ్, షేవింగ్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు... నాయిబ్రాహ్మణుల సంఘం నేతలను సంప్రదించారు. ముందుకు వచ్చిన 20 మంది నాయిబ్రాహ్మణులు ప్రతి రోజు వారి సేవలను అందిస్తున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను తాము పాటిస్తూ 15 రోజులుగా తమ దుకాణాలను మూసి ఉంచామని తెలిపారు. అధికారులు పిలుపు మేరకు స్వచ్ఛందంగా క్షవరాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పునరావాస కేంద్రాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
నాయీబ్రాహ్మణుల దాతృత్వం... నిరాశ్రయులకు సేవలు - vishakha barbers social service
విశాఖలో నాయి బ్రాహ్మణులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులకు క్షవరాలు చేస్తున్నారు. 15 రోజులుగా ఉపాధి లేక పోయినా... జీవీఎంసీ అభ్యర్థన మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

విశాఖలో నాయి బ్రాహ్మణుల దాతృత్వం... నిరాశ్రయులకు తమ సేవలు
విశాఖలో నాయి బ్రాహ్మణుల దాతృత్వం... నిరాశ్రయులకు తమ సేవలు
ఇవీ చూడండి: