విశాఖ నగరంలో అనుమతి లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలపై జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు. ఈ మేరకు కొన్ని భవన నిర్మాణాలను అడ్డుకున్నారు. విశాలాక్షినగర్, శివాజీ పాలెం, జగ్గయ్యపాలెం, సుజాతానగర్, దుర్గానగర్లో కొన్ని నిర్మాణాల సెంట్రింగ్లను తొలగించారు. ఎన్ఎస్టీఎల్ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న దుకాణాన్ని తొలగించారు. అనధికార నిర్మాణాలతో పాటు ప్రభుత్వ స్థలాల జోలికి ఎవరొచ్చినా చర్యలు కఠినంగా ఉంటాయని జీవీఎంసీ హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జీవీఎంసీ అధికారులు - అక్రమ నిర్మాణాలను తొలగించిన జీవీఎంసీ
అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ... చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. అనధికార నిర్మాణాలతో పాటు ప్రభుత్వ స్థలాల జోలికి ఎవరొచ్చినా చర్యలు కఠినంగా ఉంటాయని జీవీఎంసీ అధికారులు హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు