విశాఖ ఎంవీపీ కాలనీలో మానసిక, దివ్యాంగుల ప్రత్యేక స్కూల్ హిడెన్ స్ప్రౌట్ కూల్చివేత వార్తలను మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఖండించింది. హిడెన్ స్ప్రౌట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావుకు దివ్యాంగుల ఆశ్రమ నిర్వహణకోసం కేవలం.. రూ. 3 వేలకే వసతికి సరిపడే స్థలాన్ని ఇచ్చి మిగిలిన ప్రాంతాన్ని ఆటస్థలంగా వాడుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి పేరిట ప్రకటన చేసారు.
అనుమతి లేని వాటినే..
2013కే అద్దె గడువు ముగిసినట్లు అందులో తెలిపారు. గత 7 సంవత్సరాలుగా మైదాన స్థలంలో అనధికార నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొంది. లీజులో లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ముందస్తుగా లీజు దారులకు తెలిపనట్లు జీవీఎంసీ తెలిపింది. కానీ.. వ్యవస్థాపకులు సమాచారం లేకుండా, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల.. వాటిని మాత్రమే తొలగించినట్లు స్పషం చేసింది. కేవలం అనుమతి లేని నిర్మాణాలను కూల్చినట్లు.. స్కూల్, కార్యాలయ భవనాలకు విఘాతం కలిగించలేదని జీవీఎంసీ ప్రకటనలో తెలిపింది.