విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ సిబ్బంది - విశాఖ తాజా వార్తలు
06:06 October 24
విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద కొన్ని కట్టడాలను...రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం, ప్రహరీగోడను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. జేసీబీ, బుల్‌డోజర్లతో అర్ధరాత్రి నుంచి కూల్చివేస్తున్నారు. బీచ్‌రోడ్డులో గీతం యూనివర్సిటీకి వెళ్లే మార్గాన్ని రెండు వైపులా అధికారులు మూసివేశారు. భారీగా పోలీసులను మోహరించి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ ఆరోపిస్తుంది. ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పటం లేదని వర్సిటీ యాజమాన్యం చెపుతుంది.