నగరంలో రోడ్డు పక్కన ఉన్న అక్రమ బడ్డీలు తొలగించేందుకు విశాఖ మహా నగర పాలక సంస్థ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా వెలసిన బడ్డీలను తొలగించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 36 బడ్డీలు తొలగించింది. కొత్తగా బడ్డీలు ఏర్పాటు చేయాలంటే జీవీఎంసీ నుంచి గతంలో అనుమతి పొందిన గుర్తింపు పత్రాలు ఉంటే తప్ప అనుమతించమని స్పష్టం చేసింది.
నగరంలో అక్రమ బడ్డీల తొలగింపు - విశాఖపట్నం తాజా వార్తలు
నగరంలో అక్రమ బడ్డీలు పెరిగిపోతున్నందున వాటి తొలగించేందుకు జీవీఎంసీ దృష్టి పెట్టింది. ఇందుకోసం శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.
అక్రమ బడ్డీలను తొలగించిన జీవీఎంసీ అధికారులు