ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బకాయి వేతనాలకై జీవీఎంసీ మలేరియా విభాగం నిరసన - విశాఖలో నిరసనకు దిగిన జీవీఎంసీ మలేరియా విభాగం

జీవీఎంసీ మలేరియా విభాగం పోరు బాట పట్టింది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ విశాఖలోని గాంధీ పార్కులో ఉదోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరోనా సమయంలో తాము పడిన కష్టాన్ని గుర్తించకుండా.. వేతనాలు నిలిపివేయడం దారుణమని వాపోయారు.

gvmc employees protest
నిరసన తెలుపుతున్న జీవీఎంసీ సిబ్బంది

By

Published : Nov 5, 2020, 9:31 PM IST

బకాయి పడిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ మునిసిపాలిటీ మలేరియా విభాగం కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో శక్తివంచన లేకుండా పని చేసినా.. వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన జీతాలు విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ.. జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details