విశాఖ నగరంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్లకు గడువు సమీపిస్తున్నందున ప్రజలు దరఖాస్తు చేసుకునేట్టుగా అవగాహన కల్పించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో వివిధ పథకాలకు వచ్చిన దరఖాస్తుల తీరును శుక్రవారం సమీక్షించిన జీవీఎంసీ... అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల క్రమబద్దీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకునేట్టుగా చూడాలని నిర్ణయించింది.
'ఎల్ఆర్ఎస్, బీపీఎస్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి' - vishaka latest news
విశాఖలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల క్రమబద్దీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకునేట్టుగా చూడాలని జీవీఎంసీ నిర్ణయించింది. బీపీఎస్కు దరఖాస్తు చేసుకోకుంటే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించింది.
Gvmc
ఎల్ఆర్ఎస్కి 1105 దరఖాస్తులు వచ్చాయి. దీనికి డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. బీపీఎస్ కోసం 6166 దరఖాస్తులు రాగా అందులో 5013 అనుమతించారు. 1153 పెండింగ్లో ఉంచారు. దీనికి అక్టోబర్ 31 ఆఖరి తేదీగా నిర్ణయించారు. నగరంలో ఇంకా 4087 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టు జీవీఎంసీ వివరించింది. వీటికి సరైన రుసుము చెల్లించి బీపీఎస్లో క్రమబద్దీకరణ చేయించుకోనట్టయితే వాటిని అక్రమ కట్టడాలుగా ప్రకటించి కూల్చివేస్తామని హెచ్చరించింది.