ప్రభుత్వ ఆదేశానుసారం అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల మంజూరుకు సిద్దంగా ఉండాలని.. జీవీఎంసీ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్ ఆషాజ్యోతి, యూసీడీ పథక సంచాలకులు, జోనల్ కమిషనర్లు, ఏపీటీలు, ఏపీ టిడ్కో సంస్థ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సొమ్ము తిరిగి చెల్లించవలసిన అనర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. వివిధ కేటగిరీల కింద 24,000కు పైగా ఉన్న గృహాల మంజూరు కోసం అర్హుల జాబితా రూపొందించాలన్నారు.
గృహ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు కోసం చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. విశాఖలోని వివిధ ప్రాంతాలలో దాదాపు పాతికవేల గృహాలను టిడ్కో సంస్థ నిర్మించింది. వీటిల్లో చాలా వరకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల మౌలిక సదుపాయాల కల్పన పెండింగ్లో ఉంది. అన్ని వివరాలను కూలంకషంగా పరిశీలించి.. వివరాలను సిద్ధం చేయాలని సిబ్బందిని జీవీఎంసీ కమిషనర్ డా. సృజన ఆదేశించారు.