ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2019, 11:02 PM IST

ETV Bharat / city

'ఈటీవీభారత్' కథనానికి స్పందన... జీవీఎంసీ కమిషనర్​ చర్యలు

విశాఖలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై 'ఈటీవీ భారత్​', 'ఈటీవీ-ఆంధ్రప్రదేశ్'లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ కథనాలకు జీవీఎంసీ కమిషనర్​ సృజన స్పందించారు.

పారిశుద్ధ్యంపై స్పందించిన జీవీఎంసీ కమిషనర్​
పారిశుద్ధ్యంపై స్పందించిన జీవీఎంసీ కమిషనర్​

విశాఖలో పారిశుద్ధ్య నిర్వహణపై 'స్వచ్ఛ లక్ష్యానికి దూరంగా' శీర్షికన ఈటీవీ-ఆంధ్రప్రదేశ్, ఈటీవీభారత్​లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ కథనాలపై జీవీఎంసీ కమిషనర్ సృజన స్పందించారు. ప్రజల సహకారంతోనే 'స్వచ్ఛ విశాఖ' లక్ష్యం సాధ్యమవుతుందని కమిషనర్ తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొంత మంది బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని... నగరానికి ఆ పరిస్థితి మంచిది కాదనే విషయం అర్థం చేసుకోవాలని సూచించారు. మూత్రశాలలను ప్రజలు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. చెత్త డబ్బాలు ఉన్నప్పటికీ... చెత్తను అదే ప్రదేశంలో బయటపడేస్తున్నారని... జీవీఎంసీ సిబ్బంది గౌరవప్రదంగా పనిచేసే వాతావరణం ప్రజలు ఏర్పరచాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ సిబ్బంది పనితీరు సరిగా లేకపోతే ప్రజలు ఫిర్యాదులు చేయాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు.

పారిశుద్ధ్య నిర్వహణపై స్పందించిన జీవీఎంసీ కమిషనర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details