ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వార్డు సచివాలయ అధికారులతో జీవీఎంసీ కమిషనర్​ సమీక్ష - visakha ward sachivalayam latest news

విశాఖ వార్డు సచివాలయాల పనితీరుపై జీవీఎంసీ కమిషనర్​ డాక్టర్​ జి. సృజన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినూత్నంగా తెచ్చిన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని ఆమె సూచించారు. దరఖాస్తుల పరిష్కారాలు నిర్ణీత గడువులో నాణ్యంగా చేయాలని చెప్పారు.

gvmc commissioner e spandana  programme
వార్డు సచివాలయ అధికారులతో మాట్లాడుతున్న జీవీఎంసీ కమిషనర్​

By

Published : Oct 19, 2020, 7:55 PM IST

విశాఖ వార్డు సచివాలయాల వ్యవస్థ పనితీరుపై, అక్కడ ప్రజలు పెట్టుకుంటున్న దరఖాస్తులపై జీవీఎంసీ కమిషనర్​ డాక్టర్​ జి. సృజన.. ఉన్నతాధికారులు.. సిబ్బందితో సమీక్షించారు. 'ఈ- స్పందన' కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు వ్యవహరించే తీరుపై ఆరా తీశారు.

ఈ సమీక్ష లైవ్‌ లింక్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచి ప్రజలు చూసే అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిష్కారాలను నిర్ణీత గడువులో నాణ్యంగా చేయాలని సూచించారు. పని తీరు బాగోలేని వార్డు సచివాలయాల అధికారులను ఆమె మందలించారు.

ABOUT THE AUTHOR

...view details