ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GVL: రుషికొండ రిసార్టు రహస్యమేంటో బహిర్గతం కావాలి: జీవీఎల్ - Loan Apps

GVL Narasimha Rao: విశాఖ అభివృద్ధిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జీవీఎల్​ నరసింహారావు స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. విశాఖ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని డిమాండ్​ చేశారు.

GVL Narasimha Rao
జీవీఎల్ నరసింహారావు

By

Published : Sep 30, 2022, 4:00 PM IST

GVL Narasimha Rao Comments: విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ అభివృద్ధికి వైకాపా, బొత్స ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. భూ కబ్జాలు తప్ప మరేం చేయలేదని విమర్శించారు. విశాఖను కూడా తమ కబ్జాలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారని.. టూరిస్టు కేంద్రమైన విశాఖలో టూరిజం అభివృద్ధి లేదని ఆరోపించారు.

రుషికొండ రిసార్టు రహస్యం చెప్పాలని, అక్కడ ఏమి కడుతున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జా సంగతి పక్కన పెడితే, ప్రజల భూములు ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టి అమ్మకాలు జరగకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రుణ యాప్​ల వల్ల జరుగుతున్న దారుణాలను ఎందుకు అడ్డుకోవటం లేదని, వారికి ప్రజా ప్రతినిధుల మద్ధతు ఉందనే విమర్శలు వస్తున్నాయని ఆరోపించారు. రుణ యాప్​ల దారుణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details