ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్కేటింగ్​లో ప్రపంచ రికార్డ్​ నెలకొల్పనున్న గుంటూరు చిన్నారులు

గుంటూరు జిల్లాకు చెందిన 25మంది చిన్నారులు స్కేటింగ్​లో ప్రపంచ రికార్డు సృష్టించనున్నారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు స్కేటింట్​ చేసి ఈ రికార్డును నెలకొల్పనున్నట్లు వారి కోచ్​ ఇమ్రాన్​ తెలిపారు.

skating
స్కేటింగ్

By

Published : Jul 24, 2021, 2:08 PM IST

గుంటూరు జిల్లాకు చెందిన 25 మంది చిన్నారులు స్కేటింగ్ లో ప్రపంచ రికార్డుకు సిద్ధమయ్యారు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకూ స్కేటింగ్ చేయటం ద్వారా రికార్డులు నెలకొల్పనున్నట్లు కోచ్ ఇమ్రాన్ తెలిపారు.

గుంటూరుకు చెందిన ఐకె స్కేటింగ్ అకాడమి ఆధ్వర్యంలో ఈ రికార్డుకు ప్రయత్నిస్తున్నారు. స్కేటింగ్ లో పాల్గొనే క్రీడాకారులు ఇవాళ హోంమంత్రి మేకతోటి సుచరితను బ్రాడిపేటలోని ఆమె నివాసంలో కలిశారు. ఆమె జాతీయ పతకాన్ని ఊపి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 24వ తేది తెల్లవారుజామున విశాఖపట్నం బస్టాండ్ సమీపంలోని వినాయకుని గుడి నుంచి వీరి ప్రదర్శన ప్రారంభం కానుంది. రాజమండ్రి, తణుకు, ఏలూరు, విజయవాడ మీదుగా స్కేటింగ్ చేసుకుంటూ ఈనెల 25వ తేదికి గుంటూరు చేరుకోనున్నారు.

ఈ ఫీట్ ద్వారా మూడు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పనున్నట్లు కోచ్ ఇమ్రాన్ వెల్లడించారు. వజ్ర వరల్డ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యుఆర్ఎఫ్ వరల్డ్ ఆసియన్ రికార్డ్ సాధించనున్నట్లు వివరించారు. ముఖ్య నగరాలు, పట్టణాల గుండా ప్రయాణించే సమయంలో కరోనా అవగాహన ర్యాలీల్లోనూ క్రీడాకారులు పాల్గొంటారు.

ఇదీ చదవండి:

Shivasri: న్యాయం కోసం ప్రశ్నిస్తే.. నిరాశ్రయురాలిగా మార్చారు..

ABOUT THE AUTHOR

...view details