కరోనా పాజిటివ్ కేసులు విశాఖ నగరంలో విజృంభిస్తున్నాయి. సముద్రతీరం సమీపంలో ఉన్న ఫిషర్ మెన్ కాలనీ, పెద్ద జాలరిపేట ఏరియాలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఇంటి పనిచేసుకునే మహిళలు ఎక్కువగా ఉండటంతో పనికి వెళ్లలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సాగరతీర కళంజియ సమాఖ్య ధాన్ ఫౌండేషన్ పేదలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ప్రతి కిట్లో ఐదు కేజీల బియ్యం, కందిపప్పు, గోధుమపిండి, నూనె, పంచదార ఉన్నాయి. సుమారు 60 మందికి రూ.770 విలువగల సరకులు ఇచ్చారు.
పేదలకు నిత్యావసర కిట్లను పంచిన కళంజియ సమాఖ్య ధాన్ ఫౌండేషన్ - వైజాగ్లో పెరుగుతన్న కరోనా కేసులు
విశాఖలోని ఫిషర్ మెన్ కాలనీ, పెద్ద జాలరిపేట ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఉపాధి కోల్పోతున్నారు. వీరిని ఆదుకునేందుకు కళంజియ సమాఖ్య ధాన్ ఫౌండేషన్ నిత్యావసర కిట్లను పంచిపెట్టింది.
![పేదలకు నిత్యావసర కిట్లను పంచిన కళంజియ సమాఖ్య ధాన్ ఫౌండేషన్ grocery kits distributed by kalanjiya samkhya dhan foundation in vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7957988-356-7957988-1594303126219.jpg)
ఫిషర్ మెన్ కాలనీలో పేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ