సీఎం జగన్‌కు విశాఖలో ఘనస్వాగతం - jagan at cm
విశాఖ చేరుకున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. సీఎం కాన్వాయ్ వద్దకు జగన్ అభిమానులు దూసుకొచ్చారు. వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపుచేశారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి బయలుదేరిన సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా మానవహారంగా ఏర్పడి స్వాగతించారు. సీఎం కాన్వాయ్ వద్దకు జగన్ అభిమానులు దూసుకొచ్చారు. వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపుచేశారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు.
వీఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కుకు వెళ్లనున్నారు. జీవీఎంసీ చేపట్టే అభివృద్ధి పనులకు వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కులో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు.