విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో కార్మికులు విధులు బహిష్కరించారు. కర్మాగారంలో వైద్యులు అందుబాటులో ఉండటం లేరని నిలదీస్తే పోలీసులు కేసులు పెడుతున్నాడంటూ కార్మికులు వాపోయారు. వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాజమాన్య సంచాలకులు కె.ఆర్.విక్టర్ రాజు ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చి శాంతింపజేశారు. వైద్యుడు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నా విరమించారు.
వైద్యుడి నిర్లక్ష్యంపై గోవాడ చక్కెర కార్మికుల ధర్నా - labours protest
వైద్యుడు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గోవాడ చక్కెర కర్మాగార కార్మికులు ధర్నా నిర్వహించారు
వైద్యుడుకి వ్యతిరేకంగా గోవాడ చక్కెర కార్మికుల ధర్నా