విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఖాళీగా ఉన్న జి+4 భవనాన్ని ఆర్టీసీ పరిపాలన భవనంగా మార్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఈ భవనాన్ని జీవీఎస్‌సీసీఎల్ (గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్) అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఇటీవల ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. కొత్తగా రంగులేసి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఆర్టీసీ పరిపాలన భవనం ఉండగా, దాన్ని ద్వారకా బస్‌స్టేషన్ భవనంలోకి మార్చే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.
విశాఖలో ఆర్టీసీ పరిపాలన భవనం?
ఆర్టీసీ పరిపాలన భవనం విశాఖకు మార్చనున్నట్లు సమాచారం. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో ఈ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
govt planning to change RTC administration building in Visakhapatnam
TAGGED:
capital vishaka latest news