సాగరతీరాన... విశాఖ నగరం అందంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రెండురోజుల పర్యటనకు నగరానికి వచ్చిన బిశ్వభూషణ్... కైలాసగిరి, తెలుగు మ్యూజియం, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగ నౌకను సందర్శించారు. మ్యూజియం సందర్శించడం ఆనందం కలిగించిందని, తెలుగు కవులు, రచయితలు, రాజకీయ ప్రముఖుల చిత్రాలు బాగున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజా నరసింగరావును స్మరించుకున్నారు. 1977లో విశాఖలో జరిగిన కార్మిక సదస్సులో పాల్గొన్నానని... విశాఖ నగరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గురువారం ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించి... ఉపకులపతితో సమావేశం కానున్నారు.
విశాఖ నగరం అందంగా ఉంది: గవర్నర్ - Visakha City
విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిటీ సెంట్రల్ పార్క్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్శించారు. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగ నౌకకు పరిశీలించిన గవర్నర్... సిటీ సెంట్రల్ పార్కులో సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు.
విశాఖ నగరం అందంగా ఉంది: గవర్నర్