Governor Kambhampati Haribabu on spiritual novel Nrusingha: మన సంస్కృతిలోని నైతికత, విలువల వైపు నడిపించే ఆధ్యాత్మిక అంశాలను యువతలో పెంపొందించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన ఆధ్యాత్మిక నవల 'నృసింగహ' ను గవర్నర్ హరిబాబు విశాఖలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం సమాజంలోని సాంఘిక దురాచారాలను ఎంతో సృజనాత్మకంగా ప్రస్తావించిందని.. దేశంలోని ఆధ్యాత్మిక మూలాల అంతర్‌దృష్టిని చదవడానికి ప్రతి యువకుడిని ప్రోత్సహిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్కృతిని పెంపొందించేందుకు కృషిచేస్తున్న రచయితలను గవర్నర్ అభినందించారు.
ఆధ్యాత్మిక నవల 'నృసింగహ'ను ఆవిష్కరించిన.. మిజోరం గవర్నర్ కంభంపాటి - Haribabu on spiritual novel Nrusingha
Governor Kambhampati Haribabu: సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ రచించిన ఆధ్యాత్మిక నవల 'నృసింగహ'ను విశాఖలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. దేశంలోని ఆధ్యాత్మిక మూలాల అంతర్‌దృష్టిని చదవడానికి యువతను ఈ నవల ప్రోత్సహిస్తుందని కంభంపాటి అన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ మూలాలున్న గవర్నర్ హరిబాబు చేతుల మీదుగా భావోద్రేక విద్యా సమాజానికి సంబంధించిన పుస్తకాన్ని(నృసింగహ) ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అన్నారు. గవర్నర్‌తో మాట్లాడటం, ఆయన కాలేజీ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సభ్యుడు మనోజ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Governor Met Modi: ప్రధానితో గవర్నర్ భేటీ.. పలు కీలక అంశాలపై ప్రస్తావన!