సాగర తీర నగరం విశాఖలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. పర్యాటక శాఖ కొత్తగా ప్రతిపాదించిన అంశాలపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ సమీక్షించారు. చాలా ప్రాజెక్టులు ఇప్పుడు పట్టాలు ఎక్కేందుకు అవకాశం కలిగింది. 163 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో తోట్లకొండ వద్ద టన్నెల్ అక్వేరియం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ వెంబడి దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
అత్యాధునిక వసతులు..
సాగర్ నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, చేపల ఉప్పాడ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నగరంపాలెం, అన్నవరం, కంచర్లపాలెం బీచ్‌లలో వాష్‌రూమ్‌లు, తాగునీరు, ఫుడ్ కోర్టులు, సిట్టింగ్ బెంచీలు, రెక్లినర్‌లతో సిట్ - అవుట్ గొడుగులు, పిల్లల పార్క్, ఫిట్‌నెస్ సామగ్రి, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ జోన్, బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, పార్కింగ్, ప్రథమ చికిత్స కేంద్రాలు , సీసీ టీవీ కంట్రోల్ రూమ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి వసతులు కల్పిస్తారు.