ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పులకు హామీగా.. ప్రభుత్వ ఆస్తులు! - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖలో ప్రభుత్వ భూములను హామీగా పెట్టి రుణాలు పొందే ప్రయత్నాలు జోరందుకున్నాయి. భూముల వివరాలను ప్రభుత్వానికి పంపే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత... అభివృద్ధి కార్పొరేషన్‌ రుణాలు సమీకరించుకోనుంది.

ఏపీఎస్​డీసీ రుణాలకు హామీగా ప్రభుత్వ ఆస్తులు !
ఏపీఎస్​డీసీ రుణాలకు హామీగా ప్రభుత్వ ఆస్తులు !

By

Published : Jun 11, 2021, 6:47 AM IST

ఏపీఎస్​డీసీ రుణాలకు హామీగా ప్రభుత్వ ఆస్తులు

రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎస్​డీసీ) రుణాల సమీకరణకు విశాఖలోని ప్రభుత్వ భూములు హామీగా దఖలు పర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సీసీఎల్ఏ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నగరంలోని 20 శాఖలకు చెందిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, చినగదలి తహశీల్దార్ కార్యాలయాల పరిధిలో రెండ్రోజులుగా ఇదే పనిలో పడ్డారు.

సుమారు 220 ఎకరాల భూములను గుర్తించి వాటి సర్వే నెంబర్లు, విస్తీర్ణం, విలువ, స్కెచ్‌లు సహా అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి నివేదికను సీసీఎల్ఏకు పంపేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా పని చేస్తోంది. హామీగా ఇవ్వనున్న ఆస్తుల్లో గవర్నర్ బంగ్లా, కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు కొన్ని తహశీల్దార్ కార్యాలయ భవనాలూ ఉన్నాయి.

వలం హామీగా చూపుతారు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తున్నారని.. వాటిని కేవలం హామీగా చూపుతారే తప్ప ఇంకేమీ కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 'ఏపీ బిల్డ్' కోసం విశాఖలో విలువైన భూములు అమ్మకాలకు పెట్టగా... వాటిపై నిరసనలు వ్యక్తమై హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను హామీగా పెట్టనున్నారన్న విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ శాఖల భూములను రుణ సమీకరణకు ఏపీఎస్​డీసీకి బదలాయించాలంటే సీసీఎల్ఏ కార్యాలయంలో పరిశీలన తర్వాత మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

ఆధార్ లేకున్నా.. వృద్ధాశ్రమాల్లో కొవిడ్ టీకాలు

ABOUT THE AUTHOR

...view details