GO issue on Transfers: ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బుధవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ అవకాశం కల్పించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. మార్గదర్శకాలు, విధివిధానాలను ఖరారు చేసింది. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికన జిల్లాలు, డివిజన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించలేదు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖ (ఏపీ వైద్య విధాన పరిషత్ కాకుండా)ల్లో పనిచేసే ఉద్యోగులనూ బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయించింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వ్యవసాయ శాఖలు సొంత మార్గదర్శకాలను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల వినతి, పరిపాలనాపరమైన సౌలభ్యానికే బదిలీలు చేయాలి. ఒకేచోట అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఉద్యోగి పనిచేసిన కార్యాలయాన్ని కాకుండా, పనిచేసిన ఊరు, పట్టణం, నగరం ప్రాతిపదికన అయిదేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలి. ఆడిట్‌శాఖకు సంబంధించి జోన్ పరిధిలోని కార్యాలయాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఒక చోట పనిచేసిన మొత్తం కాలాన్ని లెక్కించాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ - ఉద్యోగుల బదిలీలు లెటేస్టు న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
15:11 June 07
రేపటి నుంచి ఈనెల 17 వరకు బదిలీలకు అనుమతి
నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలు భర్తీ అయ్యాకే
- బదిలీల ద్వారా తొలుత నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలన్నీ భర్తీ అయ్యాకే... ఐటీడీఏయేతర ప్రాంతాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి.
- ఐటీడీఏల పరిధిలో పనిచేసే ఉద్యోగులు (లోకల్ క్యాడర్, జోనల్ క్యాడర్) అక్కడ రెండేళ్లకు పైగా పనిచేస్తే బయట ప్రాంతాలకు బదిలీకి అవకాశం కల్పించాలి.
- 50 ఏళ్లకు పైబడిన వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయకూడదు. గతంలో ఎన్నడూ ఐటీడీఏ పరిధిలో పనిచేయని వారిని ఆ ప్రాంతాలకు బదిలీ చేయటానికి ప్రాధాన్యమివ్వాలి.
- ఏసీబీ, విజిలెన్స్ కేసులు, ఏవైనా అభియోగాలు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు బదిలీల కోసం చేసుకునే వినతులను పరిగణనలోకి తీసుకోకూడదు.
- అంధత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. వారు ఏదైనా కారణాలతో ప్రత్యేకంగా విన్నవించుకుంటే తప్ప వారిని బదిలీ చేయరు.
- గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల బదిలీకి సంబంధించి గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయి.
- విభాగాధిపతులు ఈ బదిలీలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదు. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు.
బదిలీల్లో వీరికి ప్రాధాన్యం..
- 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగులకు.
- కారుణ్య నియామక ప్రక్రియ కింద ఉద్యోగం పొందిన వితంతువులకు .
మానసిక వైకల్యమున్న పిల్లలు గల ఉద్యోగులకు వైద్య సౌకర్యం ఉన్న ప్రాంతాలకు. - ఉద్యోగి, వారి భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి ఆరోగ్య సమస్యలుంటే తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతానికి.
- ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుంటే అందులో ఒకరిని భాగస్వామి పనిచేసే చోటుకు బదిలీ చేస్తారు. ఎనిమిదేళ్లకు ఒకసారే ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలుంటుంది.
ఇవీ చూడండి
Last Updated : Jun 8, 2022, 3:22 AM IST