రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని అంటున్న మంత్రి బొత్స... మిగతా రెండు రాజధానులకు ఎవరిని ఆహ్వానిస్తారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రస్తుతానికి మన దేశానికి ఒకరే ప్రధాన మంత్రి ఉండగా... ఒకటే రాజధాని ఉందని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'మిగతా రెండు రాజధానుల శంకుస్థాపనకు ఎవరిని పిలుస్తారు' - బొత్సపై గోరంట్ల బుచ్చయ్యచౌదరి కామెంట్స్
మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిగా విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తే... మిగతా రెండు రాజధానులకు ఎవరిని పిలుస్తారని ప్రశ్నించారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి